సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

1 గంట క్రితం

current
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 12:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- టీ.నర్సాపురంలో విషాదం

ప్రజాశక్తి - టి.నర్సాపురం: ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం తెడ్లం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై ఓ రైతు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం, రైతు తన పాడి గేదెలను మేత కోసం తీసుకెళ్తుండగా మార్గంలో కిందకు వేలాడుతున్న ఎల్‌టీ విద్యుత్ కేబుల్ వైర్లు గేదెలకు తగులుతాయని భావించి వాటిని చేత్తో పైకి లేపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్ ప్రసారం కావడంతో తీవ్ర షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్