సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జోన్ల విధానం రద్దు చేయాలని హకర్ల ధర్నా

1 గంట క్రితం

kackers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 11:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : జోన్ల విధానం రద్దు చేయాలని విజయవాడ నగర కమిటీ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం వద్ద హకర్లు, తోపుడుబండ్ల యూనియన్ (సిఐటియు) ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ హకర్లు ఉపాధి దెబ్బతీసే జోన్ల విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హకార్లకు, తోపుడు బండ్ల వారికి, చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వీధి వ్యాపారస్తులకు వడ్డీ లేని రుణాలు అందించి హకార్ల జీవన ఉపాధిని కాపాడాలన్నారు. వీధివిక్రయదారుల చట్టం 2014లో పటిష్టంగా అమలు జరిపి, పోలీస్ మునిసిపల్ అధికారులు వేధింపులు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, సిఐటియు నాయకులు సోమేశ్, దుర్గారావు, లక్ష్మణ్, మురళి, భూలోకం, సుబ్బరావు, హకర్లు, తోపుడు బండ్లు యూనియన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్