బాధితుల కందని డ్రిప్ వైరు, డబ్బులు
ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండలంలో దొంగతనాలు, విపరీతంగా జరిగాయి. వీటిలో అంగలలో డబ్బు, మరియు సిగరెట్టు ప్యాకెట్లు మరి ఇళ్లల్లో బంగారు నగదు తో పాటు రైతు పొలాలలోని డ్రిప్పు వైర్లు ఎత్తుకెళ్లినట్లు రైతులతోపాటు పోగొట్టుకున్న వారంతా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు తన ఉనికి కాపాడుకోవడానికి అడప దడప రికవరీ చేశారు. రికవరీ సొమ్ములను బాధితులకు రైతులకు నెలలు నడుస్తున్న అందించిన దాఖలాలు కనిపించలేదు. దీంతో కేబుల్ వైర్ కోసం రైతులు స్టేషన్స్ చుట్టూ తిరిగిన రేపు మాపు అని తిప్పుకుంటున్నారని కేబుల్ వైర్ మాత్రం ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. సంవత్సరం కిందట పుట్లూరు లో నారాయణ స్వామికి చెందిన అంగడిలోని 15000 రూపాయలు డబ్బులు మరియు సిగరెట్ ప్యాకెట్లు పోయాయని ఫిర్యాదు చేయడం జరిగింది. రికవరీ పేరుతో సగము మాత్రమే అంటే 7500 రూపాయలు మాత్రమే రికవరీ చేశారు. సంవత్సరం కావస్తున్న అవి కూడా బాధితునికి అందజేయలేదని బాధితుడు నారాయణస్వామి పేర్కొన్నాడు. నా సొమ్ము రికవరీ చేసినట్లు పోలీసులు నాకు సమాచారం ఇవ్వలేదని చెప్పడం చూస్తుంటే రికవరీ సొమ్ము ఎక్కడికెళ్ళిందో అర్థం అవుతుంది. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి రికవరీ సొమ్మును, కేబుల్ వైర్లు బాధితులకు రైతులకు ఇప్పించాలని రైతులతో పాటు బాధితులు కోరుకుంటున్నారు.








కామెంట్‌లు (0)