ఇస్లామాబాద్ : వాయువ్యపాకిస్తాన్‌లో హ్యాండ్ గ్రెనేడ్ బాంబు పేలిన ఘటనలో ఒక మహిళ, చిన్నారి సహా ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయని పోలీస్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖైబర్ ఫఖ్తుంక్వా ప్రాంతంలోని లక్కి మార్వార్ట్ జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ వివాదం కారణంగా ఒక కుటుంబంపై హ్యాండ్ గ్రెనేడ్‌ను విసిరినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలైన చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించామని అన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.
హ్యాండ్ గ్రెనేడ్ బాంబు పేలుడు.. ముగ్గురు మృతి
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 05, 2026, 02:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)