బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జల దీక్ష చేస్తూ నిరసన తెలిపిన విఆర్ఎలు

48 నిమిషాల క్రితం

VRAs staged a protest by observing a 'Jala Deeksha' (water-based protest).
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 01:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : రాష్ట్ర విఆర్ఏల సంఘం(జేఏసీ) పిలుపుమేరకు మండల విఆర్ఎల సంఘం ఆధ్వర్యంలో తమ కనీస సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ సమ్మెలో భాగంగా 8వ రోజు బుధవారం స్థానిక ప్రధాన కాలువలో జల దీక్ష తో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విఆర్ఎల సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు తాతపూడి ఇసాక్, భువనగిరి ఏసు, కార్యదర్శి కాంతేటి శివరామారావు లు మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా రూ.10,500 వేతనంతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విఆర్ఏ లందరికీ తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలని, నామినీగా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ విఆర్ఎలుగా నియమించాలని, అర్హులైన వారందరికీ 70 శాతం పదోన్నతి కల్పించాలని, మరణించిన విఆర్ఎ కుటుంబాలలో ఒకరికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం ఇవ్వాలని, పేద ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి న్యాయం చేయాలని కోరారు. విఆర్ఏల శాంతియుత ధర్నాను ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో నిరవధిక సమ్మె కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సలహాదారు గూనపల్లి నాగేశ్వరరావు, కోశాధికారి కుందేటి శ్రీను, సభ్యులు సిద్దిల చంటిబాబు, తదితర విఆర్ఎలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్