బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆలమూరులో భారీ వేప చెట్టు నేలమట్టం

54 నిమిషాల క్రితం

Massive neem tree uprooted in Alamuru.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 01:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండల కేంద్రంలోని రధం వీధిలో శ్రీ జనార్దన స్వామి వారి దేవాలయం వద్ద బుధవారం ఉదయం గాలి వాన భీభత్సమునకు భారీ వేప చెట్టు వేళ్ళతో సహా సిసి రోడ్లును లేపేసి నేలమట్టమయింది. దీంతో గ్రామస్తులకు దారి లేకుండా ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బాటసారులు వెళ్తున్నారు. సమాచారం అందుకున్న ఆలయ చైర్మన్ రాంబాబు, జూనియర్ అసిస్టెంట్ కృష్ణ పవన్ హుటా హుటిన దేవస్థానం సిబ్బందితో ఘటన స్థలానికి హాజరయ్యారు. అలాగే రోడ్ కి అడ్డంగా పడి వున్న భారీ వేప వృక్షం తొలగించే ఏర్పాట్లు దగ్గర వుండి పర్యవేక్షించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్