బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మెల్లోడుగడ్డలోకి ఫార్మా వ్యర్థ జలాలు

1 గంట క్రితం

Pharma wastewater enters Mellodugadda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 01:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి : సీఐటీయూ, అఖిలపక్ష నాయకులు


ప్రజాశక్తి-పరవాడ (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని భరణికం రహదారి మధ్యలో ఉన్న మెల్లోడుగడ్డలోకి ఫార్మా వ్యర్థ రసాయనిక జలాలను విడుదల చేస్తున్న విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్‌ రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయనతో పాటు వైసీపీ నేత, భరణికం సర్పంచ్‌ పెద్ది శెట్టి శేఖర్‌, టీడీపీ మాజీ సర్పంచ్‌ బోండా తాతారావు, కేశవ తదితరులు మెల్లోడుగడ్డలోకి వస్తున్న వ్యర్థ రసాయనిక జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .... రాంకీ యాజమాన్యం నిబంధనలను ఉల్లంఘిస్తూ గాలి, నీరు, నేలను కాలుష్యం చేస్తోందని ఆరోపించారు. వ్యర్థ రసాయనిక జలాల విడుదలపై పర్యావరణ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సమస్యపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. కాలుష్య సమస్యపై సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు కూడా దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే అఖిలపక్షాల ఆధ్వర్యంలో రాంకీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
011


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్