బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హమాస్‌ ఆర్థిక విభాగం అధ్యక్ష‍ుడు అబూ అల్వాన్‌ను హతమార్చాం : ఇజ్రాయిల్

1 గంట క్రితం

Hamas
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 04:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టెల్‌ అవీవ్‌ : హమాస్‌ ఆర్థిక విభాగం అధ్యక్ష‍ుడు ముహమ్మద్‌ అబు అల్వాన్‌ను హతమార్చినట్లు ఇజ్రాయిల్‌ సైన్యం తెలిపింది. దక్ష‍ిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ నగరంలో జరిగిన లక్ష‍ిత దాడిలో ఆయన మరణించాడని పేర్కొంది. ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ, రక్ష‍ణ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితం ఖాన్‌ యూనుస్‌లో జరిగిన దాడిలో హమాస్‌ ఆర్థిక విభాగం అధ్యక్ష‍ుడు ముహమ్మద్‌ అబు అల్వాన్‌ను హతమార్చినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. ఇజ్రాయిల్ భద్రతాదళాలు (ఐడిఎఫ్‌), ఇజ్రాయిల్‌ సెక్యూరిటీ ఏజన్సీ సంయుక్తంగా ఈ దాడి చేపట్టినట్లు తెలిపారు. హమాస్‌ నేతలను, కమాండర్లను వేటాడటం, నిధులను పంపేవారిని లక్ష్యంగా చేసుకుంటామని, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేస్తామని నెతన్యాహూ, కాట్జ్‌లు హెచ్చరించారు. గాజాలో హమాస్‌ ఉనికి లేకుండా చేసే వరకు దాడులు కొనసాగిస్తామని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్