బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండవ దశ ఓటింగ్‌లో లూలాకు ఆధిక్యం : పోల్ సర్వే

4 గంటల క్రితం

Lula leads
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 06:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బ్రసీలియా : అక్టోబర్‌లో జరగనున్న బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన తాజా అట్లాస్ ఇంటెల్/బ్లూమ్‌బర్గ్ సర్వేలో, రెండో దశ (రన్‌ఆఫ్‌) ఓటింగ్‌లో అధ్యక్షుడు లూలా డా సిల్వా ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడైంది. మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సెనారో కుమారుడు, ప్రతిపక్ష సెనెటర్ ప్లావియో బోల్సెనారోకు 42.9 శాతం మద్దతు ఉండగా, లూలాకు 49.2 శాతం మద్దతు లభించినట్లు సర్వే తెలిపింది. జూన్‌లో నిర్వహించిన సర్వేతో పోలిస్తే లూలా మద్దతు 48.8 శాతం నుంచి 49.2 శాతానికి, ప్లావియో బోల్సెనారో మద్దతు 42.3 శాతం నుంచి 42.9 శాతానికి పెరిగింది. ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోని లేదా చెల్లని/ఖాళీ ఓట్లు వేస్తామని తెలిపిన వారి శాతం జూన్‌లో 8.9 శాతం ఉండగా, తాజా సర్వేలో అది 7.9 శాతానికి తగ్గింది. మొదటి దశ ఓటింగ్‌కు సంబంధించిన సర్వేలో లూలాకు 44.9 శాతం, ప్లావియో బోల్సెనారోకు 35.8 శాతం, రెనన్ శాంటోస్‌కు 7.8 శాతం, రొనాల్డో కైయాడోకు 3.1 శాతం, రొమెయు జెమాకు 2.8 శాతం మద్దతు లభించినట్లు సర్వే వెల్లడించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్