టెల్ అవీవ్ : అమెరికా- గాజా ప్రణాళికను ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ తిరస్కరించారు. హమాస్‌ను పూర్తిగా నిరాయుధీకరణ చేసేంత వరకు సైన్యాన్ని వెనక్కి రప్పించమని స్పష్టం చేశారు. జులై చివరలో హమాస్ ఆమోదించిన ప్రణాళికను సూచిస్తూ.. ఇజ్రాయిల్ 15 పాయింట్ల డాక్యుమెంట్‌ను తిరస్కరించిందని నెతన్యాహూ ఆదివారం ప్రకటించారు. హమాస్ పూర్తిగా నిరాయుధమయ్యే వరకు ఇజ్రాయెల్ సైన్యం ఎటువంటి ఉపసంహరణ చర్యలూ చేపట్టదని, అలాగే తమ దళాలు, పౌరులకు ఎదురయ్యే ముప్పులను అడ్డుకునేందుకు చర్యలు కొనసాగిస్తుందని మంత్రివర్గ సమావేశంలో నెతన్యాహు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు మితవాద బృందం నుండి వ్యతిరేకత వ్యక్తమవడం, ప్రణాళికపై విమర్శలు తీవ్రతరమైన వారం రోజుల తర్వాత నెతన్యాహూ అధికారికంగా తన నిర్ణయాన్ని వెల్లడించారు.
అక్టోబర్‌లో ప్రకటించిన, అమెరికా నేతృత్వంలో జరుగుతున్న కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గాజాలో ఇజ్రాయెల్ కార్యకలాపాలు తగ్గినప్పటికీ, పూర్తిగా ముగియని సమయంలో, అమెరికా నేతృత్వంలో జరుతున్న కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గతేడాది అక్టోబర్‌లో ఈ డాక్యుమెంట్ విడుదలైంది. హమాస్ తన ఆయుధాలను కొత్తగా ఏర్పడుతున్న పాలస్తీనా పాలక సంస్థకు అప్పగిస్తుందని డాక్యుమెంట్‌లో పేర్కొంది. నిరాయుధీకరణ పూర్తయ్యే సమయానికి అటూ ఇటుగా ఇజ్రాయిల్ తన సైన్యాన్ని ఉపసంహరిస్తుందని డాక్యుమెంట్ తెలిపింది. గత వారం నెతన్యాహుతో సమావేశమైన తర్వాత, ఈ ఒప్పందాన్ని అమలు చేస్తున్న ట్రంప్ సంస్థ, 'బోర్డ్ ఆఫ్ పీస్'తో గతవారం సమావేశం అనంతరం నెతన్యాహూ వెనక్కి తగ్గారు. 'పూర్తి' నిరాయుధీకరణ తర్వాత మాత్రమే ఇజ్రాయెల్ సైన్య వైదొలుగుతుందని పేర్కొన్నారు. డాక్యుమెంట్‌లో కొన్నింటినీ తాము ఆమోదించామని, కొన్నింటిని వ్యతిరేకించామని అన్నారు. ఇటువంటి అంశాల్లో తమ వైఖరిని ఎలా వెల్లడించాలో తమకు తెలుసని అన్నారు. హమాస్ అన్ని ఆయుధాలను అప్పగించడం వాస్తవానికి సాధ్యమయ్యేది కాదని అన్నారు.







కామెంట్‌లు (0)