ప్యోంగ్యాంగ్ : జపాన్ క్షిపణి పరీక్షపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా రూపొందించిన 'టోమాహాక్' క్రూయిజ్ క్షిపణిని ఇటీవల జపాన్ పరీక్షించిన సంగతి తెలిసిందే. దీంతో తాము "అదనపు సైనిక చర్యలను" చేపట్టాల్సి ఉంటుందని కిమ్ యో జాంగ్ హెచ్చరించారు. జపాన్ సైన్యం తన రక్షణాత్మక వైఖరిని వీడి, ముందస్తు దాడులు చేయగల సామర్థ్యం ఉన్న సైనిక శక్తిగా మారుతోందని ఆమె పేర్కొన్నట్లు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కెసిఎన్‌ఎ బుధవారం వెల్లడించింది. ఇటీవల పసిఫిక్ మహాసముద్రంలో ఏజిస్ డిస్ట్రాయర్ చొకాయ్ నుండి టోమాహాక్ సహా పలు క్షిపణులను జపాన్ పరీక్షించింది. అలాగే ఈ ఏడాది మేలో ఫిలిప్పైన్స్‌లో అమెరికాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టింది. తమ భద్రత తీవ్ర ప్రమాదంలో పడిందని జపాన్ భావించేలా ఉత్తరకొరియా ప్రతిస్పందన ఉంటుదని కిమ్ పేర్కొన్నారు. ఈ చర్యకు పశ్చాత్తాప పడేలా చేయాలి అని ఇటీవల నెల్లో జపాన్‌పై ఆమె తీవ్ర విమర్శలు చేసినట్లు కెసిఎన్‌ఎ పేర్కొంది. టోమాహాక్ క్షిపణులను సరఫరా చేయడం, వాటి కార్యకలాపాల కోసం నౌకలను సవరించడం, క్షిపణి పరీక్షలకు మద్దతు ఇవ్వడం ద్వారా జపాన్ సైనిక సమీకరణకు అమెరికా దోహదపడుతోందని కూడా కిమ్ ఆరోపించారు. జపాన్ యొక్క ఇటువంటి ప్రమాదకరమైన సైనిక చర్యల వెనుక అమెరికా ఉందని ఆమె స్పష్టం చేశారు.
జపాన్ క్షిపణి పరీక్షలపై ఉత్తర కొరియా హెచ్చరికలు
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 05, 2026, 05:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)