ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇరాన్‌ను మరో వెనిజులాలా మార్చాలని చూసిన అమెరికా : పెజిష్కియాన్‌

23 ఆగస్టు, 2026

pezeshkian
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 03:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టెహ్రాన్‌ : ఇరాన్‌ను అమెరికా మరో వెనిజులాలా మార్చాలని చూసిందని, కానీ అమెరికా దాడులను ఇరాన్‌ ధైర్యంగా తిప్పికొట్టిందని అధ్యక్ష‍ుడు మసూద్‌ పెజిష్కియాన్‌ పేర్కొన్నారు. 'ప్రభుత్వ వారోత్సవాల' ప్రారంభం సందర్భంగా ఇరాన్‌ అధ్యక్ష‍ుడు పెజెష్కియాన్‌ చేసిన ప్రసంగాన్ని ప్రభుత్వ మీడియా ఆదివారం ప్రసారం చేసింది. అమెరికా ఇరాన్‌ను మరో వెనిజులాలా మార్చేందుకు యత్నించిందని, కానీ ఇరాన్‌ తన ప్రతిఘటన, ఐక్యత, సంఘీభావంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే శక్తిగా ఆవిర్భవించిందని అన్నారు. దేశ ప్రజలు అద్భుతమైన విజయాన్ని సాధించారని ప్రశంసించారు. ‘‘శత్రు దేశం సాగిస్తున్న ఈ ఆర్థిక యుద్ధంలో అమెరికా-ఇజ్రాయిల్‌ యుద్ధ సమయంలో మనం ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ, సహాయం చేసుకుంటూ ఎలాగైతే ఐక్యంగా నిలబడ్డామో, అలాగే ఇప్పుడు కూడా ఎదిరించాలి’’ అని అన్నారు. నాయకత్వం చూపిన మార్గాన్ని అనుసరించాలని, ఐకమత్యం, సంఘీభావంతో ఉండాలని పిలుపునిచ్చారు. మనం వివేకంతో వ్యవహరిస్తే ఏ శక్తి కూడా లొంగిపోయేలా బలవంతం చేయలేదని, నిస్సహాయులుగా వదిలివేయలేదని అన్నారు. ఐక్యత, సంఘీభావం, సానుభూతితో పాటు దేశ నాయకత్వాన్ని అనుసరించడం, మనం నమ్మిన మార్గంలో మనం పయనించడం అవసరమని అన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్