ఇంటర్నెట్ : భారత శాస్త్ర దిగ్గజాలు సర్ సీవీ రామన్, విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలామ్ చిన్న బొమ్మలు అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యాయి. స్కైరూట్ సంస్థ ప్రయోగించనున్న విక్రమ్ రాకెట్‌లో వీటిని ప్రత్యేక పేలోడ్‌గా పంపించనున్నారు. భారత శాస్త్ర, అంతరిక్ష రంగాలకు విశేష సేవలందించిన ముగ్గురు మహనీయులకు గౌరవంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. స్కైరూట్ సంస్థ ఈ నెలలో 'మిషన్ ఆగమన్' పేరిట 'విక్రమ్-I'రాకెట్‌ను శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగం ద్వారా స్కైరూట్ సంస్థ దేశానికి చెందిన ముగ్గురు గొప్ప సైంటిస్టులకు ఘన నివాళి తెలపడానికి సిద్ధమైంది. 'విక్రమ్-I' రాకెట్‌లో సర్ సీవీ రామన్, డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంల సూక్ష్మ విగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది. మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ మట్టెవాడ 18 క్యారెట్ల బంగారంతో ఒక చిన్న రాకెట్ ఆకృతిని తయారు చేసి.. అందులో ఈ ముగ్గురు సైంటిస్టుల విగ్రహాలను చెక్కారు. ఈ విగ్రహాలు ఒక్కోటి బియ్యపు గింజ కంటే చాలా చిన్నవిగా ఉంటాయి. భారతదేశాన్ని అంతరిక్ష రంగంలో సూపర్ పవర్‌గా నిలిపిన ఆ ముగ్గురు సైంటిస్టుల గౌరవార్థం స్కైరూట్ ఈ వినూత్న ప్రయత్నం చేస్తోంది. ఆ ముగ్గురు సైంటిస్టుల సూక్ష్మ విగ్రహాలతో పాటు భారతదేశానికి చెందిన ప్రముఖ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ బ్రాండ్ తయారు చేసిన 'కాస్మిక్ బ్లూమ్' కళాఖండం కూడా అంతరిక్షంలోకి ప్రయాణించనుంది.
ఆ ముగ్గురు సైంటిస్టుల బొమ్మలు అంతరిక్షయాత్రకు సిద్ధం ..!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 06, 2026, 02:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)