- వైద్య పరిశోధనల నిమిత్తం ఎయిమ్స్‌కు వెంకాయమ్మ భౌతికకాయం అప్పగింత
ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్ (గుంటూరు జిల్లా): ప్రజాశక్తి విజయవాడ ఎడిషన్ మాజీ మేనేజర్ గొట్టిపాటి శ్రీనివాసరావు తల్లి వెంకాయమ్మ (90) ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండలో మరణించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. రెండో కుమారుడు గొట్టిపాటి శ్రీనివాసరావు వద్ద ఉంటున్నారు. వెంకాయమ్మ మృతి విషయం తెలుసుకున్న సిపిఎం, ప్రజాశక్తి, ప్రజాసంఘాల నాయకులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకాయమ్మ భౌతికకాయాన్ని మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వైద్య పరిశోధనల నిమిత్తం అప్పగించారు. నివాళులర్పించిన వారిలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి, ప్రజాశక్తి సిజిఎం అచ్యుతరావు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, రైతుసంఘం నాయకులు పి.నరసింహారావు, సిపిఎం సీనియర్ నాయకులు డి.వెంకటరెడ్డి, ఐద్వా రాష్ట్ర నాయకులు డి.శ్రీనివాస్ కుమారి తదితరులు ఉన్నారు.










కామెంట్‌లు (0)