ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తొలి రౌండ్‌లో లూలాకే ఆధిక్యం ?

1 గంట క్రితం

brazil
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 07:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​- అంచనా వేసిన పోల్స్‌

బ్రెసిలియా : బ్రెజిల్‌లో ఆదివారం అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ జరిగింది. తొలి రౌండ్‌ ఓటింగులో ప్రస్తుత అధ్యక్షుడు, వామపక్ష నేత లూయిజ్‌ ఇనాసియో లూలా డ సిల్వా స్వల్ప ఆధిక్యత సాధిస్తారని శనివారం నిర్వహించిన అనేక పోల్స్‌ అంచనా వేశాయి. తొలి రౌండ్‌లో చెల్లుబాటైన ఓట్లలో ఏ అభ్యర్థికీ యాభై శాతం ఓట్లు లభించకపోతే ఈ నెల 25వ తేదీన రెండో రౌండ్‌ పోలింగ్‌ నిర్వహిస్తారు. సిఎన్‌టి/ఎండిఎ పోల్‌ ప్రకారం తొలి రౌండ్‌లో లూలాకు 47.8 శాతం, సెనెటర్‌ ఫ్లావియో బోల్సనారోకు 42.1 శాతం ఓట్లు లభించవచ్చు. డాటాఫోల్హా సర్వే ప్రకారం లూలాకు 45 శాతం, ఫ్లావియోకు 42 శాతం ఓట్లు వస్తాయి. ఖ్వయస్ట్‌ పోల్‌ అంచనా మేరకు లూలాకు 46 శాతం, ఫ్లావియోకు 45 శాతం ఓట్లు రావచ్చు. అట్లాసింటెల్‌/బ్లూమ్‌బర్గ్‌ పోల్‌ ప్రకారం లూలాకు 47 శాతం, ఫ్లావియోకు 44.1 శాతం ఓట్లు పొందుతారని వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్