బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇరుదేశాల సంబంధాల్లో జిన్‌పింగ్‌ పర్యటన మైలురాయిగా నిలుస్తుంది : చైనా దౌత్యవేత్త

1 గంట క్రితం

Xie Feng
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 02:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్‌ : అధ్యక్ష‍ుడు జిన్‌పింగ్‌ అమెరికా పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాల్లో మైలురాయిగా నిలుస్తుందని చైనా దౌత్యవేత్త పేర్కొన్నారు. 11ఏళ్లుగా చైనా, అమెరికా మధ్య సంబంధాలు త్రీవమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అమెరికాలోని చైనా దౌత్యవేత్త షీ ఫెంగ్‌ తెలిపారు. ఈ అనుభవం సంబంధాలు తెంచుకోవడం అసాధ్యమని, ఘర్షణ ఆమోదయోగ్యం కాదని నిరూపించిందని షీ వాదించారు. ప్రపంచవ్యాప్తంగా అసమానతలు పెరుగుతున్న సమయంలో.. ఇరుదేశాల మధ్య స్థిరమైన, ఆరోగ్యకరమైన, సుస్థిరమైన సంబంధాలు గతంలో కన్నా మరింత అవసరమని అన్నారు. ద్వైపాక్ష‍ిక సంబంధాల్లో జిన్‌ పింగ్‌ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని ఆయన ప్రశంసించారు. మే నెల నాటి సమావేశం ఇరుదేశాల మధ్య నిర్మాణాత్మక, వ్యూహాత్మక, స్థిరమైన సంబంధం కోసం ఒక కొత్త విధానాన్ని నెలకొల్పిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.చైనా, అమెరికాలు తమ నేతలు కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేయాలని, ఇప్పటికే ఉన్న రాజకీయ, దౌత్య, ఆర్థిక, వాణిజ్య యంత్రాంగాలను మరింతగా వినియోగించుకోవాలని అన్నారు. సైనిక, శాంతిభద్రతలు, ఆరోగ్యం, వ్యవసాయం, పర్యాటకం శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక రంగాలతో సహా పలు రంగాల్లో వినిమయ్యాన్ని విస్తరించాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు దేశాల మధ్య పోటీ అనివార్యం, కానీ అది నిర్మాణాత్మకంగా ఉండాలని, ఇరుపక్షాలు కలిసికట్టుగా శ్రేయస్సు, పురోగతిని సాధించాలని షీ ఫెంగ్‌ అన్నారు. ఎఐరంగంలో పోటీ అనేది ఆవిష్కరణ, భద్రత,నియంత్రణ, నాగరికతల మధ్య పరస్పర అభ్యసనం, మెరుగైన ప్రపంచ పరిపాలన ఉండాలని అన్నారు. ఎఐని మంచి కోసం, మానవాళి ప్రయోజనం కోసం అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్