శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపీలో మరో 7 కరోనా కేసులు నమోదు..

1 గంట క్రితం

covide
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 07:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 7 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 39కు చేరింది. కొత్తగా నమోదైన కేసులతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. రాష్ట్రంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్