శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

బ్రహ్మపుత్ర నదిలో గల్లంతైన కడప విద్యార్థిని మృతదేహం లభ్యం

02 ఆగస్టు, 2026

Body of Kadapa student who went missing in the Brahmaputra River recovered.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 01:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కడప : అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో గల్లంతైన కడప జిల్లా జమ్మలమడుగు తహసీల్దార్‌ సాయినాథ్‌రెడ్డి కుమార్తె చేతన (20) మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. చేతన అస్సాం రాష్ట్రంలోని ఐఐటి గువాహటిలో చదువుతోంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కళాశాల సమీపంలో ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నదిలో వరద నీటి ఉద్ధృతిని చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ప్రవాహంలో జారిపడి గల్లంతైంది. మృతదేహాన్ని గుర్తించిన అధికారులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తహసీల్దార్‌ సాయినాథ్‌రెడ్డి అస్సాంకు వెళ్లారు. ఒక్కగానొక్క కుమార్తె అకాల మరణంతో కొట్టాలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్