ప్రజాశక్తి-గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)లో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. బాపట్ల జిల్లా కర్లపాలెం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం అతనికి వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ బాధితుల కోసం జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డును అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎయిమ్స్‌లో ఇప్పటికే నలుగురు కోవిడ్ పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ అనుమానం ఉన్నవారికి పరీక్షలు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.
గుంటూరు జీజీహెచ్‌లో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు
20 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 10:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)