శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఉద్యోగాలు ఇవ్వండి.. లేకుంటే భూములు తిరిగి ఇవ్వండి’

2 గంటల క్రితం

steel plant
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 12:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • గాజువాక ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. విశాఖ ఉక్కు భూ నిర్వాసితుల బైఠాయింపు!

  • భారీగా పోలీసుల మోహరింపు

ప్రజాశక్తి-గాజువాక : విశాఖ ఉక్కు కర్మాగారం భూ నిర్వాసితుల ‘48 గంటల వంటావార్పు’ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టీల్‌ప్లాంట్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు తమను అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భూ నిర్వాసితులు.. నేరుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్యాలయానికి తరలివచ్చారు. ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించి, చర్చలు జరిపి వెళ్తామని నిర్వాసితులు పేర్కొన్నప్పటికీ, పోలీసులు వారిని కార్యాలయం లోపలికి అనుమతించకుండా బయటే నిలిపివేశారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన నిర్వాసితులు కార్యాలయం ఎదుటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే తెలుగు తల్లి విగ్రహం సమీపంలో మహిళలు, నిర్వాసితులు ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. దశాబ్దాలుగా తమకు జరుగుతున్న అన్యాయంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

"విశాఖ ఉక్కు కర్మాగారం కోసం మా విలువైన భూములను త్యాగం చేశాం. దశాబ్దాలు గడిచినా మాకు శాశ్వత ఉపాధి కల్పించలేదు. మాకు ఉద్యోగాలు ఇవ్వండి... లేకపోతే మా భూములు మాకు తిరిగి ఇచ్చేయండి" అంటూ నిర్వాసితులు తెగేసి చెప్పారు.

నిరసన తీవ్రరూపం దాల్చడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎమ్మెల్యే కార్యాలయం పరిసరాల్లో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితి మరింత చేజారకుండా ఉండేందుకు పోలీసులు ప్రస్తుతం నిర్వాసితుల నాయకులతో చర్చలు జరుపుతున్నారు.


సంబంధిత వార్తలు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్