ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనెట్‌ఫ్లిక్స్‌లో 800 మంది ఉద్యోగులపై వేటు..!

10 అక్టోబర్, 2026

నెట్‌ఫ్లిక్స్‌లో 800 మంది ఉద్యోగులపై వేటు!
2022 తర్వాత అత్యధిక ఉద్వాసనలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 10:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 2022 తర్వాత అత్యధిక ఉద్వాసనలు

​న్యూఢిల్లీ : ప్రముఖ ఒటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ భారీగా ఉద్యోగాల కోతకు సిద్దమయ్యింది. సంస్థలోని మొత్తం 16,000 మంది పూర్తిస్థాయి ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే సుమారు 800 మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. ఈ ఉద్వాసనలపై వచ్చే వారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని రిపోర్టులు వస్తోన్నాయి. కాగా.. ఈ వార్తలపై స్పందించేందుకు నెట్‌ఫ్లిక్స్‌ నిరాకరించింది. 2022లోనూ వృద్ధి మందగించడం, చందాదారులు తగ్గడంతో వందలాది మందిని తొలగించిన సంస్థ.. ఇప్పుడు మరోసారి భారీ కోతకు సిద్ధమవుతోంది. స్ట్రీమింగ్‌ మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ నెట్‌ఫ్లిక్స్‌పై ఒత్తిడి పెంచుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్