ముంబయి : రెండేళ్లలో రాష్ట్రంలో 500కు పైగా ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు మరణించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. పాము కాటుతో గడ్చిరోలిలోని రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్‌లో ముగ్గురు గిరిజన బాలికలు మరణించిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. గిరిజన అభివృద్ధి విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు ఈ వివరాలను వెల్లడించారు. పాము కాటు, సికిల్‌సెల్ అనీమియా, తీవ్రమైన అనారోగ్యం, ఆత్మహత్య, ప్రమాదాల్లో సుమారు 584మంది విద్యార్ధులు మరణించారని తెలిపారు. గిరిజన విద్యార్థుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం 500 ప్రభుత్వ పాఠశాలలను, 513 అనుబంధ ఆశ్రమ పాఠశాలలను నడుపుతోందని అన్నారు. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో 384మంది విద్యార్థులు మరణించగా, అనుబంధ పాఠశాలల్లో 200 మంది మరణించినట్లు వెల్లడించారు.
రెండేళ్లలో 500కుపైగా ఆశ్రమ పాఠశాల విద్యార్థులు మృతి : మహారాష్ట్ర
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 14, 2026, 04:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)