చెన్నై : శాంతిభద్రతల విభాగాన్ని సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ), 2005 పరిధి నుంచి మినహాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వంలోని పబ్లిక్ (శాంతిభద్రతల) విభాగాన్ని ఆర్‌టిఐ పరిధి నుంచి మినహాయిస్తూ మానవ వనరుల నిర్వహణ శాఖ ఉత్తర్వులు జారీ చేసి, ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించింది. ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్ 24(4) కింద ఈ మినహాయింపును ప్రకటించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆర్‌టిఐ నుంచి శాంతిభద్రతల విభాగం మినహాయింపు ఉత్తర్వులు వెనక్కి
10 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 05:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)