మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రామమందిర విరాళాల చోరీ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ల తిరస్కరణ

1 గంట క్రితం

Ayodhya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 12:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లక్నో : అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితుల బెయిల్‌ పిటిషన్లను ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. అవినాష్‌ శుక్లా,మనీష్‌ కుమార్‌ యాదవ్‌,రామ్‌ శంకర్‌ మిశ్రాల బెయిల్‌ పిటిషన్లపై ప్రత్యేక న్యాయమూర్తి రజత్‌ వర్మ విచారణ జరిపినట్లు నిందితుల తరఫు న్యాయవాది కుల్‌ శేఖర్‌ సింగ్‌ తెలిపారు. నిందితులు ప్రభుత్వ ఉద్యోగులు కానందున వారిపై అవినీతి,ప్రభుత్వ ఉద్యోగి ద్వారా క్రిమినల్‌ విశ్వాస భంగానికి సంబంధించిన నిబంధనలు వర్తించవని నిందితుల తరపు న్యాయవాది వాదించారు.ఆ రెండు నిబంధనలను తొలగిస్తే మిగిలిన నేరాలకు గరిష్టంగా ఏడేళ్ల శిక్ష మాత్రమే ఉంటుందని,ప్రత్యేక పరిస్థితులు లేనందున బెయిల్‌ మంజూరు చేయవచ్చని కోర్టుకు తెలిపింది.ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయలేదని కూడా న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న అనంతరం కోర్టు బెయిల్‌ పిటిషన్లను తిరస్కరించింది.

ఈ కేసులోని మరో ముగ్గురు నిందితుల బెయిల్‌ పిటిషన్లపై మంగళవారం, మిగిలిన ఇద్దరి పిటిషన్లపై బుధవారం విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ప్రాథమిక నివేదిక ఆధారంగా జూన్‌25న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఆలయంలో నగదు విరాళాలను లెక్కించే పనిలో ఎక్కువ మంది నిందితులు బ్యాంకు ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. విరాళాల లెక్కింపు ప్రక్రియకు సుభాష్‌ శ్రీవాస్తవ బాధ్యత వహించగా, రామశంకర్‌ అలియాస్‌ తిన్ను యాదవ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ప్రాసిక్యూషన్‌ వివరాల ప్రకారం,దర్యాప్తులో ఇప్పటివరకు రూ.79.85లక్షలు స్వాధీనం చేసుకున్నారు.దర్యాప్తు నివేదిక,కేసు డైరీ సమర్పణలో జాప్యం కారణంగా గతంలోనూ బెయిల్‌ పిటిషన్ల విచారణ పలుమార్లు వాయిదా పడింది.దీంతో కేసు డైరీ,దర్యాప్తు నివేదికను సమర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్