న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ప్రతినిధులతో కేంద్రమంత్రి జె.పి.నడ్డా సమావేశమయ్యారు. జె.పి.నడ్డాతో సమావేశమైనట్లు సిజెపి ప్రతినిధి సౌరవ్‌దాస్ ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. రెండు గంటలకుపైగా వేచి చూసిన అనంతరం, తాను, అశుతోష్ రాంకా జె.పి.నడ్డాను ఆయన నివాసంలో కలిశామని, డిమాండ్లతో కూడిన లేఖను సమర్పించామని తెలిపారు. డిమాండ్ల లేఖపై చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారని అన్నారు. మరోవైపు సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు జంతర్ మంతర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. భారీ సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జెపి నడ్డాతో భేటీ అయిన సిజెపి ప్రతినిధులు
16 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 02:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)