సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సిజెపి నిరసనకు మద్దతు తెలిపిన సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

1 గంట క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 04:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నిరసనకు సిపిఐ(ఎం) మద్దతు ప్రకటించింది. సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, పార్లమెంట్‌ సభ్యులు అమ్రారాం, డి. రమాదేవి తదితరులు సోమవారం జంతర్‌ మంతర్‌కు చేరుకున్నారు. సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే, వాంగ్‌చుక్‌లతో మాట్లాడారు. వారు చేపడుతున్న ఆందోళనకు మద్తతు ప్రకటించారు.

నీట్‌, సహా పలు పరీక్ష‍ల ప్రశ్నాపత్రాల లీకేజీకి కేంద్రం బాధ్యత వహించాలని సిజెపి డిమాండ్‌ చేస్తోంది. గత 24 రోజుల నుండి సిజెపి ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిరవధిక నిరాహార దీక్ష‍ 16వ రోజుకి చేరుకుంది. వాంగ్‌ చుక్‌ ఆరోగ్యం క్ష‍ీణించిందని, నిరాహార దీక్ష‍ చేపట్టిన తర్వాత నుండి 7.8 కేజీల బరువుతగ్గారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్