న్యూఢిల్లీ : 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో విద్యార్థి నేత షార్జిల్ ఇమామ్ బెయిల్ పిటిషన్‌పై స్పందించాలని పోలీసులను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇమామ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ వికాస్ మహాజన్‌లతో కూడిన ధర్మాసనం నోటీసు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్ట్ 27కి వాయిదా వేసింది. ఢిల్లీ అల్లర్ల కేసులో 2020 ఆగస్ట్ 25న పోలీసులు అరెస్ట్ చేసి, ఆయనపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. జులై 4న ఉమర్ ఖలీద్, ఇమామ్‌లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు కొట్టివేసింది. బెయిల్ అంశంలో సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించిన షరతులకు లోబడి ఉండాల్సిందేనని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.
షార్జిల్ ఇమామ్ బెయిల్ పిటిషన్‌పై స్పందించాలని పోలీసులకు ఆదేశాలు
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 17, 2026, 01:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)