మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తమిళనాడు సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డిఎంకె ఎమ్మెల్యే అరెస్ట్‌

18 గంటల క్రితం

DMK MLA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 12:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విలాతికులం డిఎంకె ఎమ్మెల్యే మార్కండేయన్‌ను తూతుత్తకుడి జిల్లా క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం ఉదయం ఆయన నివాసం నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో ఆయన మద్దతుదారులు పోలీసు చర్యను ఖండిస్తూ నినాదాలు చేశారు. కోవిల్‌పట్టిలో పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో తమిళనాడు సిఎంపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అక్కడి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు శనివారం ఒక సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంకె ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆర్‌.ఎస్‌.భారతి, మాజీ మంత్రి పి.గీత జీవన్‌ సహా పలువురు డిఎంకె నేతలు పాల్గొన్నారు. సభను ఉద్దేశించి మాట్లాడుతూ మార్కండేయన్‌ సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టివికె సభ్యులు ఆదివారం తూత్తుకూడి జిల్లా క్రైమ్‌ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్