కోల్‌కతా : టిఎంసి మాజీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ కుమారుడు తీర్థాంకర్ ఘోష్‌ను పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా నుండి సోమావరం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మోసం, దోపిడీ, బెదిరింపులకు పాల్పడటంతో పాటు గెలుపొందిన లాటరీ టిక్కెట్లను దోచుకునేందుకు యత్నించారన్న ఫిర్యాదులపై గత కొంతకాలంగా తీర్థాంకర్ కోసం గాలిస్తున్నామని అన్నారు. ఆయనను బరాక్‌పూర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లినపుడు కోడిగుడ్లను విసిరారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్‌పై కూడా కేసు నమోదైందని అన్నారు. జులై 11న రిటబత్ర బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి రెబల్ వర్గం నిర్వహించిన సమావేశంలో ఆయన బహిరంగంగా కనిపించారని, కానీ పోలీసులకు చిక్కుకుండా తప్పించుకున్నారని అన్నారు. అయితే తాము నిర్మల్ ఘోష్‌ను ఏ సమావేశానికీ ఆహ్వానించలేదని, ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని రెబల్ వర్షం స్పష్టం చేసింది.
టిఎంసి మాజీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 13, 2026, 03:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)