ముంబై : ముంబైలోని మంఖుర్డ్, జనతా నగర్ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా శనివారం రాత్రి మూడు అంతస్తుల చాల్‌లోని ఒక భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో రెండు మూడు ఇళ్లు దెబ్బతినడంతో, నలుగురు మహిళలతో సహా ఆరుగురు మరణించారు. మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సిసి ఉంది.
ముంబైలో భారీ వర్షాలు.. ఆరుగురు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 06, 2026, 07:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)