శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రధాని పార్లమెంటులో ప్రకటన చేయాలి.. అర్థరాత్రి కాదు : ఖర్గే

1 గంట క్రితం

Kharge
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 11:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలని, అర్థరాత్రులు కాదని రాజ్యసభ ప్రతిపక్ష‍ నేత మల్లికార్జున్‌ ఖర్గే విమర్శించారు. విద్యార్థులకు వీడియో సందేశంపై ప్రధాని మోడీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంటుకు వచ్చే ముందు ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని, విద్యార్థులకు క్ష‍మాపణలు చెప్పాలని, విద్యార్థుల గొంతుకను అణచివేసేందుకు లాఠీలు, కర్రలు, పెల్లెట్‌ గన్‌లను ప్రయోగించాలని ఆదేశించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించిన తర్వాతే విద్యావ్యవస్థపై చర్చించేందుకు ప్రతిపక్ష‍ం సిద్ధంగా ఉంటుందని ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రధాని పార్లమెంటులో మాట్లాడాలని, అప్పుడే ప్రధాని అసలైన మాటలు అర్థమవుతాయని అన్నారు. అర్థరాత్రి 12.00గంటలకు మాట్లాడటానికి బదులుగా పగటి పూట పార్లమెంటుకు వచ్చి మాట్లాడాలని అన్నారు. ఏదైనా హామీని అధికారికమైనదిగా, జవాబుదారీతనం కలిగినదిగా పరిగణించాలంటే, అది ప్రతిపక్ష‍ం పరిశీలించడానికి వీలుగా శాసనపరమైన ప్రక్రియలో భాగంగానే ఇవ్వాలని ఖర్గే స్పష్టం చేశారు. సిజెపి నేతృత్వంలో నిరసనలు కొనసాగుతుండగా, గురువారం రాత్రి ప్రధాని మోడీ ఎక్స్‌ వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనపై మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్