న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీక్ వ్యవహారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఐదో రోజూ తీవ్ర ప్రతిష్ఠంభనకు దారితీసింది. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి దీంతో లోక్‌సభ సోమవారానికి, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరమే చర్చ చేపడతామని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. సభ కార్యకలాపాలు సజావుగా సాగకుండ అడ్డుకుంటున్నారంటూ చైర్మన్ జగదంబిక పాల్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. నీట్‌పై చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, అయితే స్పీకర్, బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనుమతి పొందిన తర్వాత, సభ అజెండాలో చేర్చిన అనంతరం చర్చ చేపడతామని అన్నారు. అయితే ముందుగా కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు నినాదాలు చేపట్టారు. దీంతో చైర్మన్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నీట్ పేపర్ లీక్‌పై చర్చకు సంబంధించి ప్రతిపక్షాలు ముందస్తు షరతులు విధిస్తూ చర్చ నుండి పారిపోయేందుకు యత్నిస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. మరోవైపు రాజ్యసభ సైత్య మధ్యాహ్నం 2.00గంటలకు వాయిదా పడింది.
లోక్‌సభ సోమవారానికి వాయిదా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 24, 2026, 12:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)