శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నిరసనల్లో పాల్గొంటే.. క్రమశిక్ష‍ణ చర్యలు తప్పవు : విద్యార్థులను బెదిరించిన జెఎన్‌యు

1 గంట క్రితం

jnu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 12:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : సిజెపి నిరసనలో పాల్గొనకుండా జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) విద్యార్థులపై బెదిరింపులకు దిగింది. జంతర్‌ మంతర్‌ నిరసనలో పాల్గొంటే చట్టపరమైన పరిణామాలు, యూనివర్శిటీ నిబంధనల ప్రకారం క్రమశిక్ష‍ణ చర్యలు తప్పవని జెఎన్‌యు విద్యార్థులను హెచ్చరించింది. ఢిల్లీ యూనివర్సిటీ (డియు) తరహాలోనే జెఎన్‌యు శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. జంతర్ మంతర్ లేదా దాని పరిసర ప్రాంతాల్లో జరిగే నిరసనల్లో పాల్గొనవద్దని విద్యార్థులను హెచ్చరించింది. విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తమ వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. బహిరంగ నిరసనల విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా, న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ లేదా దాని పరిసరాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొనకూడదని, లేదా అక్కడికి వెళ్లకూడదని హెచ్చరించింది. సోషల్‌మీడియాలో కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే.. చట్టప్రకారం ఎదురయ్యే పరిణామాలను, యూనివర్శిటీ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. క్రమశిక్ష‍ణ చర్యలు ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించింది. జంతర్‌ మంతర్‌లో జరిగే అనధికారిక సమావేశాలు, నిరసనల్లో పాల్గొనకూడదని ఢిల్లీయూనివర్శిటీ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. విద్యార్థులు, ప్రొఫెసర్స్‌ నిరసనలకు దూరంగా ఉండాలని, లేకుండా చర్యలు తప్పవని హెచ్చరించింది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్