మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకున్నాం : తమిళనాడు ప్రభుత్వం

02 ఆగస్టు, 2026

Rajmohan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 01:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : నీట్‌ వ్యతిరేక ఆందోళనల సమయంలో విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ ఆదేశాల మేరకు, విద్యార్థులపై కేసులన్నింటినీ ఉపసంహరించుకున్నామని విద్యాశాఖమంత్రి రాజ్‌మోహన్‌ ఆదివారం తెలిపారు. మరిన్ని వివరాలను ప్రభుత్వం త్వరలో వెల్లడిస్తుందని ఆయన సోషల్‌మీడియా ఎక్స్‌లో పేర్కొన్నారు. గతవారం నీట్‌కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల సమయంలో తమిళనాడులోనూ ఆందోళనలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా కొన్ని చోట్ల ఆకస్మిక ఆందోళనలు, చెన్నైలోని సిపిఐ ప్రధాన కార్యాలయమైన ‘బాలన్‌ ఇల్లం’లోనూ నిరసనలు జరిగాయి. నిరసనల సమయంలో రహదారి దిగ్బంధనాలకు పాల్పడిన విద్యార్థులను కొన్నిచోట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్