mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చిరంజీవితో బిజెపి చీఫ్ భేటీ ..!

2 గంటల క్రితం

BJP Chief meets Chiranjeevi...!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 01:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవితో భారతీయ జనతా పార్టీ (బిజెపి) చీఫ్ రామచందర్ రావు సోమవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి సమావేశం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘మహా‌జన్ సంపర్క్ అభియాన్’ అనే కార్యక్రమంలో భాగంగా ... ఈ భేటీలో ప్రధాని మోడి 12 ఏళ్ల పాలనా ప్రగతికి సంబంధించిన స్పెషల్ బుక్, బ్రోచర్లను చిరంజీవికి రామచందర్ రావు అందజేశారు. ఇద్దరి సమావేశం పూర్తిగా మర్యాదపూర్వకమైనదని, ప్రభుత్వ విజయాలను వివరించడానికే మెగాస్టార్‌ను కలిశామని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి రామచందర్ రావుల భేటీ మోడి ప్రభుత్వ విజయాలను వివరించడానికేనని బిజెపి నేతలు చెప్తున్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం సరికొత్త చర్చకు తెరలేచింది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసి, ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలకే పరిమితమైన చిరంజీవి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తారా ? ఒకవేళ వస్తే బిజెపి లో చేరే అవకాశం ఉందా ? అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండటంతో, తాజా సమీకరణాలు చిరంజీవిని కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకునేలా చేస్తాయా అని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చలు ఊపందుకున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్