శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పసిడి ధరకు భారీ షాక్‌.. ఒక్కరోజే రూ.5,300 పతనం !

13 గంటల క్రితం

A major shock for gold prices a drop of Rs 5300 in a single day
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 01:11 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

వెండి ధరలోనూ భారీ కోత.. కిలోకు రూ.10 వేలకు పైగా తగ్గుదల


బిజినెస్ : దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. ముఖ్యంగా బంగారం ధర ఒక్కరోజులోనే భారీగా తగ్గడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. హైదరాబాద్‌ మార్కెట్లో శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.5,300 తగ్గి రూ.1,27,900కు చేరింది. గురువారం ముగింపు సమయానికి ఈ ధర రూ.1,33,200గా ఉంది. దీంతో పసిడి ధర రూ.1.30 లక్షల దిగువకు పడిపోయింది.


వెండి ధర కూడా భారీగా తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,65,000 నుంచి రూ.1,54,680కు దిగివచ్చింది. అంటే ఒక్కరోజులోనే కిలో వెండిపై రూ.10,000కు పైగా తగ్గుదల నమోదైంది.


అంతర్జాతీయ మార్కెట్లోనూ అదే పరిస్థితి

దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. స్పాట్‌ గోల్డ్‌ ఔన్సు ధర 3,546 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గతంలో 4,000 డాలర్లకు పైగా ఉన్న బంగారం ధర కొద్ది రోజుల వ్యవధిలోనే 500 డాలర్లకు పైగా పడిపోయింది. స్పాట్‌ వెండి ఔన్సు ధర 41.84 డాలర్లుగా నమోదైంది.


ఇక కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో డిసెంబరు డెలివరీ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 10 గ్రాముల ధర రూ.1.22 లక్షల వద్ద, కిలో వెండి ధర రూ.1.49 లక్షల వద్ద కొనసాగుతున్నాయి.


ధరల పతనానికి కారణాలివే !


అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలపై అమెరికా డాలర్‌ బలోపేతం ప్రభావం చూపుతోంది. డాలర్‌ విలువ పెరగడంతో ఇతర దేశాల కొనుగోలుదారులకు బంగారం కొనుగోలు మరింత ఖరీదుగా మారుతోంది. దీంతో పసిడికి డిమాండ్‌ తగ్గుతోంది. మరోవైపు అమెరికా ట్రెజరీ బాండ్లపై ప్రతిఫలాలు పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడులను తగ్గించి బాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు.


అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలను మించి నమోదవడం, ఆర్థిక గణాంకాలు బలంగా ఉండటం కూడా బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ పరిణామాలతో డిసెంబరులో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు బలపడుతున్నాయి.


డాలర్‌ విలువ పెరగడం, బాండ్లపై రాబడులు అధికం కావడం, అమెరికా వడ్డీ రేట్లపై మారుతున్న అంచనాలు వెరసి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల భారీ పతనానికి దారితీస్తున్నాయి


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్