- 14 నెలల కనిష్టానికి పసిడి!
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా తగ్గాయి. బుధవారం(నవంబర్ 18) ఉదయం ట్రేడింగ్‌లో పసిడి ధర 14 నెలల కనిష్ట స్థాయికి చేరువైంది. వెండి ధరలు కూడా భారీ నష్టాలను నమోదు చేశాయి. దీంతో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది.
బులియన్స్.కో.ఇన్ డేటా ప్రకారం.. ఉదయం 9:06 గంటల సమయానికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.2,540 తగ్గి రూ.1,32,300కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,21,275గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. 999 స్వచ్ఛత కలిగిన వెండి కిలో ధర రూ.4,940 తగ్గి రూ.1,65,400కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి, వెండి ధరలు నష్టాల్లోనే కొనసాగాయి. ట్రేడింగ్‌వ్యూ డేటా ప్రకారం.. ఉదయం 9:07 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ఔన్స్ ధర 1.35 శాతం తగ్గి సుమారు 3,797 డాలర్ల వద్ద ట్రేడయింది. స్పాట్ వెండి ఔన్స్ ధర 2.67 శాతం క్షీణించి సుమారు 46 డాలర్లకు చేరింది.
బంగారంలో 24 క్యారెట్లు అత్యంత స్వచ్ఛమైనవి కాగా, 22 క్యారెట్ల బంగారాన్ని సాధారణంగా ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. వెండిలో 999 స్వచ్ఛత కలిగిన వెండిని నాణేలు, కడ్డీల తయారీకి వినియోగిస్తారు. 925 స్వచ్ఛత కలిగిన వెండిని ఎక్కువగా ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పతనం, దేశీయ మార్కెట్‌లోనూ ప్రతిబింబించడంతో విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. రానున్న రోజుల్లో ధరల కదలికలు ఎలా ఉంటాయన్నది మార్కెట్ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.








కామెంట్‌లు (0)