న్యూఢిల్లీ : బంగారం ధరల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుంది. బుధవారం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.3,220 తగ్గి రూ.1,24,580గా నమోదయ్యింది. 22 క్యారెట్లపై రూ.2,950 కోల్పోయి రూ.1,14,200గా పలికింది. 10 గ్రాముల వెండిపై రూ.100 తగ్గి రూ.1650గా చోటు చేసుకుంది. కిలో వెండిపై రూ.1000 తగ్గి రూ.1,65,000గా నమోదయ్యింది. అమెరికా డాలర్ బలపడటం పసిడి, వెండి ధరలపై ఒత్తిడి తెస్తోందని బులియన్ వర్గాలు వెల్లడించాయి. గరిష్ఠ ధరల నుంచి భారీగా తగ్గిన బంగారం ధరలు కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తున్నాయన్నారు. జనవరిలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.8 లక్షలకు చేరగా, ఇటీవల రూ.1.2 లక్షల స్థాయికి పడిపోయింది.పెళ్లిళ్ల వంటి అవసరాలున్న వారు మొత్తం కొనుగోలును ఒకేసారి చేయకుండా విడతలుగా కొనడం ద్వారా ధరల ఒడిదుడుకుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అమెరికా డాలర్ బలపడటం, వడ్డీరేట్ల పెంపు అంచనాలు, ఈక్విటీ మార్కెట్లలో మెరుగైన పెట్టుబడి అవకాశాలు బంగారం ధరలపై ఒత్తిడి కొనసాగవచ్చని భావిస్తున్నారు.







కామెంట్‌లు (0)