గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Gold - భారీగా పెరిగిన పసిడి ధర ..!

11 గంటల క్రితం

Gold prices surge again
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 12:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బిజినెస్ : పసిడి కొనుగోలుదారులకు గురువారం ధరల పెరుగుదల షాక్ ఇచ్చింది. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ఏకంగా రూ.2,900 పెరుగుదల నమోదైంది. బుధవారం రూ.1,39,910గా ఉన్న ధర గురువారం ఉదయానికి రూ.1,42,810కు చేరింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,910గా నమోదైంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,07,110 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి, కాకినాడ నగరాల్లోనూ ఇవే ధరలు ఉన్నట్లు మార్కెట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు అధిక స్థాయిలో కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,960గా ఉంది. చెన్నైలో రూ.1,42,920గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో రూ.1,42,810గా కొనసాగుతోంది.


అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపుతుంటాయి. వీటి కారణంగా పసిడి, వెండి ధరల్లో తరచూ హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. కాబట్టి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునేవారు షాపులకు వెళ్లే ముందు తాజా ధరలను తెలుసుకోవడం మంచిది. అలాగే నగల ధరలో జీఎస్టీ, తరుగు, మజూరీ వంటి అదనపు ఛార్జీలు కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్