గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Gold & Silver - పండగ వేళ .. బంగారం, వెండి దిగొచ్చాయి ..!

17 నిమిషాల క్రితం

Gold & Silver - During the festive season... gold and silver prices have come down!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 12:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

బిజినెస్ : పండగ సీజన్‌ లో బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు నెలకొన్నాయి. మరోవైపు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చనే అంచనాలు కూడా బంగారం, వెండికి డిమాండ్‌ తగ్గడానికి కారణమవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు దేశీయ మార్కెట్‌లోనూ కొనుగోళ్ల ధోరణులు ఈ విలువైన లోహాల ధరలపై ప్రభావం చూపుతున్నాయి.


గురువారం ఉదయం హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,47,348గా నమోదైంది.

కిలో వెండి ధర రూ.2.06 లక్షలకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ధర ఔన్సుకు 4,089డాలర్లకు పడిపోయింది.

దీంతో బంగారం ధర దాదాపు వారం రోజుల కనిష్ఠ స్థాయికి చేరింది. వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది.


వెండి ధర కూడా తగ్గుముఖం ...

దీంతో బంగారం ధర దాదాపు వారం రోజుల కనిష్ఠ స్థాయికి చేరింది. వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర 56.32 డాలర్లకు దిగివచ్చింది.

ఇక ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.44 లక్షల వద్ద ఉండగా.. కిలో వెండి ధర రూ.2.03 లక్షల స్థాయిలో ట్రేడవుతోంది.


బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణాలివే !


చమురు ధరల పెరుగుదల ....

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 110.5 డాలర్లకు పైనే కదలాడుతోంది. సౌదీ అరేబియాలోని అరామ్‌కో సంస్థపై హూతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతుండటం, చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం ఇందుకు కారణాలుగా ఉన్నాయి. చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణ భయాలు మరింత పెరిగాయి.


రూపాయి బలోపేతం ....

దేశీయ మార్కెట్‌లో రూపాయి విలువ బలపడటం కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్న మరో అంశంగా కనిపిస్తోంది.


ఫెడ్‌ వడ్డీ రేట్లపై అంచనాలు ....

ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే వారం అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో వడ్డీ రూపంలో ఎలాంటి రాబడి ఇవ్వని బంగారంలో పెట్టుబడులు పెట్టడం కంటే.. ఇతర పెట్టుబడి మార్గాల వైపు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు.


ఆభరణాల కొనుగోళ్లు మందగించడం ....

పండగ సీజన్‌ కొనసాగుతున్నప్పటికీ, ఆభరణాల రూపంలో బంగారం కొనుగోళ్లు మందగించడం కూడా ధరల తగ్గుదలకు మరో కారణంగా భావిస్తున్నారు. మొత్తంగా అంతర్జాతీయ పరిణామాలు, ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లపై అంచనాలు, రూపాయి బలోపేతం, ఆభరణాల కొనుగోళ్లలో మందగమనం వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్