గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆల్ఫాబెట్‌ షేర్ల పతనం.. రూ.26 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ ఆవిరి

4 గంటల క్రితం

Alphabet shares tumble; Rs 26 lakh crore in market value wiped out
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 11:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

google : టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ షేర్లు అమెరికా స్టాక్‌ మార్కెట్లలో భారీగా పడిపోయాయి. బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే కంపెనీ షేర్లు 11 శాతం వరకు క్షీణించాయి. దీంతో సంస్థ మార్కెట్‌ విలువలో 280 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.26 లక్షల కోట్లు) తుడిచిపెట్టుకుపోయాయి. కృత్రిమ మేధ (ఎఐ) సేవలకు డిమాండ్‌ పెరుగుతున్నప్పటికీ, అందుకు అనుగుణంగా లాభాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం మదుపర్లను ఆందోళనకు గురిచేసింది.


ఆల్ఫాబెట్‌ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వాల్ ‌స్ట్రీట్‌ అంచనాలను అందుకోలేకపోయాయి. గూగుల్‌ క్లౌడ్‌ విభాగం ఆదాయం 30.7 బిలియన్‌ డాలర్లకు చేరినప్పటికీ, గూగుల్‌ సెర్చ్‌, యూట్యూబ్‌ విభాగాల్లో ఆదాయ వృద్ధి ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. క్లౌడ్‌ వ్యాపారంలో వృద్ధి కనిపించినా, మొత్తం ఫలితాలు పెట్టుబడిదారుల అంచనాలను అందుకోలేకపోయాయి.


కంపెనీ ఆదాయం పెరిగినప్పటికీ, నికర లాభాలు, ఒక్కో షేరుపై వచ్చే ఆదాయం మాత్రం అంచనాల కంటే తక్కువగా నమోదయ్యాయి. ఎఐ సాంకేతికత, క్లౌడ్‌ సేవల విస్తరణ కోసం ఆల్ఫాబెట్‌ భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ పెట్టుబడుల కారణంగా నగదు లభ్యతపై ఒత్తిడి పెరుగుతుండటం మదుపర్లలో ఆందోళనకు దారితీసింది.


భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ, సమీప భవిష్యత్తులో వాటికి తగిన స్థాయిలో లాభాలు వస్తాయా ? అనే సందేహాలు పెట్టుబడిదారుల్లో నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆల్ఫాబెట్‌ షేర్ల విక్రయాలు పెరిగి, కంపెనీ మార్కెట్‌ విలువ భారీగా పడిపోయింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్