గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నీటమునిగిన పొలాలను పరిశీలించిన అధికారులు

1 గంట క్రితం

Officials inspected the waterlogged fields
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 03:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వీరఘట్టం (మన్యం) : ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డీన్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ డాక్టర్ జి జోగి నాయుడు వీరఘట్టం మండలం హుస్సేన్ పురం, నడుకూరు గ్రామంలలో నీట మునిగిన సుమారు 300 ఎకరాల పొలాలను పరిశీలించారు. నీరు బయటికి వెళ్లాక పడిపోయిన చేను కట్టలుగా కట్టి నిలబెట్టాలని సూచించారు. ఏ పొలం అయితే పూర్తిగా పండి నేలమట్టం అయ్యిందో వాటిపై ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేసి మొలక ఎత్తకుండా చేయాలి అని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ కే లక్ష్మణ మాట్లాడుతూ చేలో ఉన్న నీటిని కాలువల ద్వారా బయటికి పంపించి పొట్ట దశ కొచ్చే చేనులో ఒక శాతం పొటాషియం నైట్రేట్ ని పిచికారి చేయాలని చెప్పారు. వ్యవసాయ పరిశోధన స్థానం సీతంపేట అధిపతి డాక్టర్ జి చిట్టిబాబు మాట్లాడుతూ నీరు విడిచి పెట్టాక పొట్ట కుళ్ళు రాకుండా పంటను కాపాడేందుకు ప్రాఫికో నజోల్ ఒక మిల్లీలీటరు లేదా హెక్సాకొనజోలు 200 లీటర్లు లేదా ట్రై ఫ్లాక్సీ స్ట్రోబిన్ మరియు టేబుకొనజోల్ మందును 0.5 మిల్లీమీటర్లు ఒక లీటర్ ఇంటికి చెప్పు ఉన్న పిచికారి చేయాలని తెలిపారు. వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీమతి కే రత్నకుమారి మాట్లాడుతూ రైతులు వారి పొలాలను వ్యవసాయ సహాయకులు వద్ద నమోదు చేయించాలని సూచించారు. ఈ క్షేత్ర సందర్శనలో వ్యవసాయ పరిశోధన స్థానం సీతంపేట విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు మరియు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఎస్ శ్రీనివాసరాజు, స్రవంతి, అనంత విహారి,అమృత వీణ అదే విధంగా వ్యవసాయ సహాయకులు గుణశేఖర్, అరవింద్ , మురళి, అదీప్ మరియు రైతు సోదరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్