ప్రజాశక్తి-తెనాలి రూరల్ (గుంటూరు) : తెనాలి మండలంలోని పలు ప్రాంతాల్లో అర్నబ్ తుపాను ప్రభావంతో ... భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా నేలవాలిన వరి పంటలను జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గురువారం పరిశీలించారు. సోమసుందర పాలెం, కంచరపాలెం గ్రామాల్లో రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడిన తరువాత నేరుగా పొలాల్లోకి దిగి పంటల పరిస్థితిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె. శ్రీరమణి, జిల్లా వ్యవసాయ అధికారి ఎం పద్మావతి, తాసిల్దార్ గోపాలకృష్ణ వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
నీటమునిగిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 29, 2026, 03:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)