గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు

1 గంట క్రితం

Amazon
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 03:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్‌ : అమెజాన్‌ మరోసారి లేఆఫ్‌లు ప్రకటించింది. అమెజాన్‌ బుధవారం తన డివైసెస్‌ అండ్‌ సర్వీసెస్‌ యూనిట్‌లో సుమారు 250మందిని తొలగించనున్నట్లు బుధవారం ప్రకటించింది. తాము కొద్ది మంది ఉద్యోగులను తొలగించాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నామని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని సంస్థప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ తొలగింపులు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి, తమ ఉత్పత్తి పునరుద్ధరణకు అనుగుణంగా మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయని అన్నారు. బుధవారం తెల్లవారుజామున ఉద్యోగులకు టెక్స్ట్ మెసేజ్‌లు, ఇమెయిల్‌లు పంపినట్లు ఆయన తెలిపారు. కంపెనీ క్షుణ్ణంగా సమీక్షించిందని, ఫలితంగానే కోతలు అవసరమయ్యాయని డివైసెస్,సర్వీసెస్ విభాగంలోని హ్యూమన్ రిసోర్సెస్ వైస్ ప్రెసిడెంట్ చెరీ రాబిన్సన్ ఆ ఇమెయిల్స్‌లో పేర్కొన్నట్లు మీడియా తెలిపింది.

ఈ నెల ప్రారంభంలో, అమెజాన్ తన ప్రధాన రిటైల్ విభాగంలో సుమారు 1,000మంది ఉద్యోగులను తొలగించింది. గురువారం మార్కెట్ ముగిసిన అనంతరం, మూడవ త్రైమాసిక ఆదాయ వివరాలను వెల్లడించనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్