పడిపోయిన చెట్ల తొలగింపు నుండి పునరావాస కేంద్రాల్లో భోజన ప్యాకెట్ల పంపిణీ వరకు వారి సేవలు
ప్రజాశక్తి - అంబాజీపేట (కోనసీమ) : అర్నబ్ తుపాన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులకు వాకలగరువు - తొండవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కడలి చంద్రకళ సుబ్బారావు అండగా నిలిచారు. బుధవారం ఉదయం నుండి అభ్యర్థి చంద్రకళ సుబ్బారావు, కుటుంబ సభ్యులు కడలి దుర్గా ప్రసాద్,కడలి ఆనంద్ (కుమారుడు)లు గ్రామస్తులు పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి వాకలగరువు ప్రధాన రహదారిపై పడిపోయిన భారీ చెట్లను, గ్రామ కాలనీల్లో ఇళ్లపై పడిన చెట్లను, తెగిపడిన విద్యుత్ తీగలను యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. దీంతో రాకపోకలకు మార్గం సుగమం అయ్యింది. అనంతరం బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం బిర్యానీ 650 ప్యాకెట్లను వాకలగరువు ఫిషర్ మెన్ పేటలో, తొండవరం పునరావాస కేంద్రాల్లో ఉన్న తొండవరం, నందంపూడి,గున్నేపల్లి గ్రామాల ప్రజలకు అందజేశారు.ప్రభుత్వ చర్యల కంటే ముందే స్పందించి సేవలందించినందుకు తుపాన్ బాధితులు, గ్రామ ప్రజలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కుటుబ సభ్యలు కాండ్రేగుల బాల దుర్గా ప్రసాద్,కె.ఆనంద్ లు మాట్లాడుతూ గతంలో కూడా గ్రామ ప్రజలకు అండగా ఉండి వ్యక్తిగతంగాను,పరోక్షంగాను పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని,ఇకపై కూడా గ్రామానికి, ప్రజలకు మా వంతు సేవలందిస్తున్నామన్నారు. మా సేవలకు సహకరించిన గ్రామస్తులు, గ్రామస్థులకు,మిత్రులకు కృతజ్ఞతలు అని తెలిపారు.








కామెంట్‌లు (0)