బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Canva - 1,271 మంది ఉద్యోగులకు కాన్వా ఉద్వాసన

1 గంట క్రితం

Canva lays off 1271 employees
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 01:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఉద్యోగుల పట్ల సానుభూతి చూపిన సీఈఓ.. ఆరు నెలల వేతనంతో పాటు ప్రత్యేక ప్యాకేజీ


ప్రముఖ డిజైన్ ప్లాట్‌ఫామ్ కాన్వా (Canva) సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం ఉద్యోగుల్లో 22 శాతం మందికి, అంటే 1,271 మందికి ఉద్వాసన పలికింది. సంస్థ 13 ఏళ్ల చరిత్రలోనే ఇది అత్యంత కఠిన నిర్ణయమని సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ మెలానీ పెర్కిన్స్ పేర్కొన్నారు.

canva officer


ఉద్యోగుల తొలగింపుపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆమె రాసిన భావోద్వేగ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నిర్ణయం ఉద్యోగుల ప్రతిభకు, పనితీరుకు సంబంధించింది కాదని, వారి కృషి, సృజనాత్మకత సంస్థ ఎదుగుదలకు ఎంతో దోహదపడ్డాయని ఆమె పేర్కొన్నారు.


ఉద్యోగాలు కోల్పోయిన వారికి కనీసం ఆరు నెలల వేతనం, సాధ్యమైన చోట ఏడాది పాటు ఆరోగ్య బీమా, కెరీర్ కోచింగ్, కౌన్సెలింగ్ వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా సొంత వ్యాపారాలు, సామాజిక ప్రాజెక్టులు ప్రారంభించాలనుకునే వారికి సుమారు రూ.8.3 లక్షల గ్రాంట్ అందించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు.


సాధారణ లే-ఆఫ్ ప్రకటనలకు భిన్నంగా ఉద్యోగుల పట్ల సానుభూతి, బాధ్యతను ప్రతిబింబించేలా సీఈఓ లేఖ ఉందంటూ లింక్డ్‌ఇన్‌లో పలువురు ప్రశంసిస్తున్నారు. ఉద్యోగాల కోతతో పాటు బాధితులకు అండగా నిలిచేందుకు తీసుకున్న చర్యలు టెక్ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.


లింక్డ్‌ఇన్ యూజర్ల ప్రశంసలు ....

కాన్వా సీఈవో లేఖ లింక్డ్‌ఇన్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సాధారణంగా కంపెనీలు ఇచ్చే రూటిన్ లే-ఆఫ్ ప్రకటనలతో పోలిస్తే ఈ లేఖ ఉన్న తీరు చాలా భిన్నంగా ఉందని కొంతమంది యూజర్లు కొనియాడారు. కాన్వా మహిళా వ్యవస్థాపకురాలి నుండి వచ్చిన ఈ మాస్ లే-ఆఫ్ మెమో టోన్ సాధారణంగా మనం చూసే లే-ఆఫ్ మెమోల కంటే చాలా భిన్నంగా ఉంది. దీనిని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను" అని ఒక యూజర్ రాశారు. తీసుకోవాల్సినంత కఠినమైన నిర్ణయాన్ని నిజంగా అంతే బాధ్యతతో తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఇతర కంపెనీలు కూడా దీనిని గమనిస్తాయని ఆశిస్తున్నా అని మరొకరు కమెంట్‌ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్