హైదరాబాద్: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నల్లగండ్ల సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 3.5 కిలోమీటర్ల వాకథాన్ విజయవంతమైంది. ఆసుపత్రి నుంచి డైమండ్ హైట్స్ సర్కిల్ వరకు సాగిన ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, రోగులు, సీనియర్ సిటిజన్లు, యువత సహా 400 మందికి పైగా ఉత్సాహంగా పాల్గొన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆసుపత్రి రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ పాలచర్ల ప్రభాకర్ నాయకత్వం వహించిన ఈ కార్యక్రమంలో, సీనియర్ కార్డియాలజిస్టులు డా. రామకృష్ణ, డా. సందీప్ ఖంబంపాటి, కార్డియోథొరాసిక్ సర్జన్ డా. గిరిధర్ తదితరులు పాల్గొని గుండె ఆరోగ్యానికి సంబంధించి నివారణాత్మక చర్యలు, ముందస్తు పరీక్షలు, చురుకైన జీవనశైలి ప్రాముఖ్యతను వివరించారు.
సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ‘వరల్డ్ హార్ట్ డే వాకథాన్’
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 08:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)