శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకార్పొరేట్ల రుణాలకు డిమాండ్‌

12 గంటల క్రితం

SBI Chairman Setty
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 10:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎస్‌‌బిఐ ఛైర్మన్‌ సిఎస్‌ శెట్టి

ముంబయి : కార్పొరేట్ రుణాల అవకాశాలు భారీగా పుంజుకున్నాయని దేశీయ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌బిఐ) తెలిపింది. కార్పొరేట్‌ రుణాలకు సంబంధించి ఎస్‌‌బిఐకి దాదాపు రూ.5 లక్షల కోట్ల విలువైన అవకాశాలు ఉన్నాయని ఆ బ్యాంక్‌ చైర్మన్‌ సిఎస్‌ శెట్టి తెలిపారు. పునరుత్పాదక ఇంధనం, బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, డేటా సెంటర్లు తదితర విభిన్న రంగాల్లో కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతుండటం దీనికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. విదేశీ కరెన్సీ నాన్‌-రెసిడెంట్‌ (ఎస్‌‌సిఆన్‌ఆర్‌(‌బి)) డిపాజిట్ల ద్వారా 10 బిలియన్‌ డాలర్లు సమీకరించాలన్న లక్ష్యాన్ని ఎస్‌బిఐ కొనసాగిస్తోందని తెలిపారు. రాయితీతో కూడిన ప్రత్యేక విండో ముగియడానికి నాలుగు రోజుల ముందు నాటికి బ్యాంక్‌ ఇప్పటికే 9 బిలియన్‌ డాలర్ల మేర డిపాజిట్లను సమీకరించిందని చెప్పారు. ఎస్‌‌బిఐ సారథిగా ఆయన రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఈ విషయాలను ఓ ఇంగ్లీష్‌ ‌మీడియాకు తెలిపారు.

​ ఇక సిఎస్‌ శెట్టి పదవీకాలంలో ఎస్‌‌బిఐ ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారిగా మార్కెట్ నుంచి ఈక్విటీ రూపంలో రూ.25,000 కోట్లను సమీకరించింది. ఇదే కాలంలో బ్యాంకు ఏకీకృత నికర లాభం 2025-26లో రూ.85,168 కోట్లకు చేరుకుంది.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్