శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టాటా సన్స్ బోర్డు సమావేశంపై ఉత్కంఠ

4 గంటల క్రితం

టాటా సన్స్ బోర్డు సమావేశంపై ఉత్కంఠ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 09:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : ​నవంబర్ 26న జరగాల్సిన టాటా సన్స్ బోర్డు సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ 17న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశానికి సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లను ఇవ్వాలని టాటా ట్రస్ట్స్ ఛైర్మన్, టాటా సన్స్ నామినీ డైరెక్టర్ నోయెల్ టాటా మరోసారి కోరారు. ఎన్ చంద్రశేఖరన్ పునర్నియామక నిర్ణయం చెల్లుబాటుపై ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు, నామినీ డైరెక్టర్ వేణు శ్రీనివాసన్‌కు సంబంధించి ప్రయోజనాల అంశాన్ని కూడా ప్రస్తావించారు. నవంబర్ 26న జరగనున్న తదుపరి బోర్డు సమావేశానికి ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడంతో కార్పొరేట్‌ ‌వర్గాల్లో ఉత్కంట నెలకొంది. నవంబర్ 20న కంపెనీ సెక్రటరీ, గ్రూప్ కార్పొరేట్ సెక్రటరీ సుప్రకాశ్ ముఖోపాధ్యాయకు పంపిన లేఖలో గతంలో కోరిన పత్రాల్లో కొన్నింటిని మాత్రమే అందించారని నోయెల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డైరెక్టర్‌గా కంపెనీ భౌతిక, ఎలక్ట్రానిక్ రూపాల్లో నిర్వహించే పుస్తకాలు, రికార్డులను పరిశీలించే హక్కు తనకు ఉందని, చట్టం లేదా కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం సమావేశ రికార్డింగ్‌లను నిరాకరించే అధికారం లేదని ఆయన వాదించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్