శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హైదరాబాద్‌లో గ్లోబల్ రైజ్ 2026 ఘన ప్రారంభం

5 గంటల క్రితం

hyd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 09:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

: ఎంఎస్‌ఎంఈలకు అంతర్జాతీయ అవకాశాలపై ప్రత్యేక దృష్టి

హైదరాబాద్ : నగరంలోని తాజ్ వివాంటా వేదికగా 'గ్లోబల్ రైజ్ 2026' (Global RISE 2026) వ్యాపార సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఎస్‌ఎంబీ కనెక్ట్ (SMBConnect) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 15 నగరాల దేశీయ వ్యాపార పర్యటనలో భాగంగా హైదరాబాద్ ఆరో వేదికగా నిలిచింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ (FTAs), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మరియు పారిశ్రామిక వృద్ధి అవకాశాలపై దాదాపు 130 మంది పారిశ్రామిక వేత్తలు, నిపుణులు ఈ సదస్సులో మంతనాలు జరిపారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, అధునాతన మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో బలమైన పట్టున్న హైదరాబాద్, ఎంఎస్‌ఎంఈలు (MSMEs) అంతర్జాతీయ మార్కెట్లలో ఎదిగేందుకు ఈ వేదిక చక్కటి అవకాశాలను కల్పిస్తోందని ఎస్‌ఎంబీ కనెక్ట్ వ్యవస్థాపకుడు సందీప్ రాయ్ తెలిపారు. గణేష్ విసర్జన వేళ నగరంలో కనిపించిన అద్భుతమైన ఐక్యత స్పూర్తితోనే వ్యాపార వర్గాల మధ్య కూడా ఈ వేదిక ద్వారా బలమైన అనుసంధానం ఏర్పరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శరత్ మరోజు ప్రసంగించగా, హెప్టిక్ భాగస్వామ్యంతో AI వినియోగంపై ప్రత్యేక సదస్సులు జరిగాయి. అలాగే పలువురు ప్రముఖులతో ప్యానెల్ చర్చలు నిర్వహించి, అంతర్జాతీయ ఎగుమతుల్లో ఎఫ్‌టీఏల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక రంగంలో విశేష కృషి చేసిన పలువురికి 'గ్లోబల్ రైజ్ అవార్డ్స్ 2026' అందజేసి ఘనంగా సత్కరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్